Download app

రాజా గురించి

images missing

దాడిశెట్టి రామలింగేశ్వర రావు అలియాస్ దాడిశెట్టి రాజా గత 30 ఏళ్ళ నుంచి తుని నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేందుకు రాజకీయ నాయకుడిగా మారిన వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా 2014 ఎన్నికల్లో 18,573 ఓట్ల అత్యున్నత మెజారిటీతో ఆయన గెలిచారు.

రాజా సమస్యలపై పోరాడటానికి తన నిజాయితీ మరియు నిర్భయమైన వైఖరికి ప్రసిద్ది చెందారు, ఆయన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ధివిస్ ల్యాబ్స్, అక్రమ ఇసుక మాఫియా, వృద్ధులకు పెన్షన్, జన్మభూమి సంఘాల దురాగతాన్ని అరికట్టి కులమతంతో సంబంధం లేకుండా ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడిిగా మరియు శక్తివంతమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా ఆయన చెరగని ముద్ర వేశారు.

image missing
237వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

తుని : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లి నుంచి ఈరోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. విశాఖపట్నం జిల్లాలో శరభవరం, శృంగవరం, గాంధీనగర్‌, వై దొండపేట జంక్షన్‌, ఎర్రవారం మీదుగా ఈరోజు పాదయాత్ర కొనసాగనుంది. సుమారు నెల రోజుల పాటు విశాఖ జిల్లాలో ప్రజాసంకల్పయాత్రకొనసాగనుంది.

image missing
గుంటూరులో వైసీపీ ''వంచనపై గర్జన దీక్ష''

విభజన హామీలపై పోరుబాట పట్టింది వైఎస్సార్‌సీపీ. గుంటూరులోని వీఏఆర్‌ గార్డెన్స్‌లో వంచనపై గర్జన దీక్ష పేరుతో భారీ ఆందోళనా కార్యక్రమం నిర్వహించింది. ఈ దీక్షలో పార్టీ సీనియర్ నేతలతో పాటూ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొనగా.. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు దీక్షను నిర్వహిస్తున్నారు. దీక్ష వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు. విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం మోసం చేస్తే.. స్పెషల్ ప్యాకేజీ పేరుతో ఏపీ ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

image missing
దేశం ఓ గొప్ప నేతను కోల్పోయింది

హైదరాబాద్‌: భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. భారతరత్న వాజ్‌పేయి మరణించారన్న వార్త ఎంతగానో బాధించిందని తెలిపారు. అటల్‌జీ మరణంతో మన దేశ రాజకీయాల్లో ఓ గొప్పశకం ముగిసినట్టయిందని పేర్కొన్నారు. విభేదించే రాజకీయ పార్టీల వారికి కూడా ఆమోదయోగ్యుడిగా, అద్భుతమైన-ఆకట్టుకునే వక్తగా, కవిగా, రాజకీయ విలువలూ మర్యాదల పరంగా శిఖర సమానుడిగా, విదేశీ దౌత్య దురంధరుడిగా, …

ముఖ్య కథనాలు
image missing
వాజ్‌పేయి లేకపోవడం ఒక యుగాంతంలా ఉంది!

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. అటల్‌జీ లేకపోవడం శూన్యంలా అనిపిస్తోందని, నిశ్శబ్దంలా గోచరిస్తోందని, వాజ్‌పేయి లేరనేది ఒక యుగాంతంలా అనిపిస్తోందని ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజకీయా రంగానికి వాజ్‌పేయి మరణం తీరని లోటు అన్నారు. బీజేపీ ఒక గొప్ప నాయకున్ని కోల్పొయిందని పేర్కొన్నారు. ‘నాకు మాటలు రావడం లేదు. అటల్‌జీ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన ప్రతి నిమిషం దేశం కోసం పనిచేశారు. ప్రియమైన నేత అటల్ బిహారీ వాజ్‌పేయి దివంగతులుకావడంతో భారతదేశం శోక సముద్రంలో మునిగిపోయింది’ అని ట్వీట్ చేశారు. ఆయన దివంగతులు కావడంతో ఓ శకం ముగిసిందని పేర్కొన్నారు. ఆయన దశాబ్దాలుగా దేశం కోసం జీవించారని, అత్యంత శ్రద్ధాసక్తులతో దేశానికి సేవ చేశారని పేర్కొన్నారు.

image missing
అలరించిన కోలాట ప్రదర్శన

కోటనందూరులో కోలాటాన్ని ప్రదర్శించిన కళాకారులు: కోటనందూరు,తూర్పుగోదావరి :నమస్తే చెల్లెమ్మా.. నమస్తే అక్కయ్యా.. అంటూ ఆప్యాయంగా పిలిచిన వైఎస్సార్‌ అంటే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు వల్లమాలిన ప్రేమ. అదే బాటలో జనం కోసం పరితపిస్తున్న మహానేత తనయుడు జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. అక్కచెల్లెమ్మలైతే అన్నకు సమస్యలు చెప్పుకుని ఓదార్పు పొందుతున్నారు. అన్నకు దిష్టి తీస్తున్నారు. కోటనందూరులో మహిళలు ఆధ్యాత్మిక దుస్తులు ధరించి, కాళ్లకు గజ్జెలు, చేతిలో కర్రలతో కోలాటాన్ని ప్రదర్శించారు. అన్న అడుగులకు లయబద్ధత కల్పించారు.

image missing
మంత్రి యనమలకు ఘోర అవమానం!

అమరావతి : ఏపీ ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రి అయిన యనమల రామకృష్ణుడికి ఘోర అవమానం జరిగింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల విషయంలో యనమలకు సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం యనమల కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నారు. అయితే, కృష్ణా జిల్లాలో పంద్రాగస్టు నాడు జెండా ఎగరేసే అవకాశం మంత్రి పరిటాల సునీతకు ముఖ్యమంత్రి ఇచ్చారు. సీనియర్ మంత్రి, బీసీ నేతను కాదని జూనియర్ మంత్రి అయిన సునీతకు సీఎం అవకాశం ఇవ్వడం గమనార్హం. ఫిరాయింపు మంత్రి అమర్నాథ్‌రెడ్డికి సైతం జెండా ఎగురవేసే అవకాశం దక్కింది. కానీ యనమలకు అవకాశం ఇవ్వలేదు. గత ఏడాది సీనియర్‌ మంత్రి అయిన కేఈ కృష్ణమూర్తికి కూడా ఇదేవిధంగా అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది జెండా ఆవిష్కరణ విషయంలో తనకు అవమానం జరగడంతో మంత్రి యనమల మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా తూర్పు గోదావరిలో యనమలకు అవకాశమున్నా.. చంద్రబాబు ఇవ్వకపోవడంతో యనమల కినుకు వహించినట్టు తెలుస్తోంది.

image missing
236వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

డి. పోలవరం,తుని: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 236వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.తాటిపాక, బిళ్లనందూరు క్రాస్‌, బొడ్డువరం క్రాస్‌, జగన్నాథపురం, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆయన పాదయాత్ర సాగిస్తున్నారు.

మీకు ఏవైనా ఆందోళన ఉంటే దయచేసి మాకు తెలియజేయండి

దాడిశెట్టి రాజా ఎమ్మెల్యే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
9177229999, 9652690008
9848888405
dadisettyraja99@gmail.com
3-30, అన్నవరం, తుని మండల్ ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్,533406